సమాంతర స్వప్నం నిరుద్యోగి వేదనను కళ్ళకు కట్టే సవితాసంపుటి. ఏండ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, నోటిఫికేషన్ వచ్చినా అది ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో తెలియని స్థితి.
ఆందోళనలో నిరుద్యోగి కలలు వివర్ణమవుతున్న విధానాన్ని కవి కళ్ళకు కడతాడు. అపురూపమైన అభివ్యక్తి పాఠకులను కదిలిస్తుంది.
‘ఎంత సంభాషించుకున్నా మాటలు మిగిలిపోతూనే ఉన్నాయి ఎంత మోస్తున్నా ఎదురు చూపుల బండలు ఇంకా బరువెక్కుతూనే ఉన్నాయి.
నిరుద్యోగులని ఎవరన్నారో కానీ అసిధారల్ని ఆలింగనం చేసుకుంటున్న వింత యోగులం’ * కాస్త వెతకండి హృదయం చిరునామా గల్లంతయింది — — — బుచ్చిబాబు చివరకు మిగిలేది మీద ఎంతో ఇష్టంగా, ప్రేమగా రాసిన వ్యాసం చదివితే ముగించేవరకు చదివిస్తుంది.
Nene (A Collection of Poems) in Telugu చిట్లిన నీరు చిల్లిన గాజు చిప్పిల్లిన చెమ్మ ఎకసెక్కాల నడుమ ఎకాఎకీ గుక్క. నిండార్హుడెవడూ లేడు, జీవితం ఓ అసందర్భ వ్యంగ్యచిత్రం చిక్కిపోయినవాన్ని. లోకం, ఎవర్నెక్కడ పట్టాలో తెలిసిన వృత్తివేటగాళ్లది కదా! పట్టుబడ్డాను. వలనెలానూ లేపలేను. ప్రయత్నమంతా తెంచుదామనే వలను కొరికేద్దామనే పక్షుల్లో కలుద్దామనే. పంటి సామర్ధ్యం ఒక ప్రశ్న కదా!
Collection of Telugu Poetry తెలుగు సాహిత్యంలో చిన్న కవితల ప్రాధాన్యత ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అలాంటి సందర్భంలో వచ్చిన పూల పూల వాన పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. పూల పూల వానలో మనస్సుని ఆర్ద్రపరచగలిగే అనేక ఖండికలున్నాయి. ఈ కవి గతంలో మనం వాడిన నుడికారాలను గుర్తొచ్చే విధంగా కొత్తనుడికారాలను వాడుతాడు. చూడండి. “పండితులు కూర్చుండు మా అరుగు మేలు నాలుగిండ్ల ముచ్చట్ల సారమే తేలు”
తెలంగాణ రుబాయిలు నరసింహారెడ్డిని గొప్ప తాత్వికుడైన కవిగా నిలుపుతుంది. ఈ కావ్యం రుబాయి ప్రక్రియను శిఖర స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. సరళమైన పదాలు, భావానికి తగిన చిత్రిక, శక్తివంతమైన ఉపమానాలు, లోతైన తాత్వికత, మృదువైన వ్యక్తి కరణ ఈ కావ్యం లోని మేలిమి గుణాలు. వేమన పద్యాలకు వ్యాఖ్యానం అక్కరలేనట్లుగానే నరసింహారెడ్డి రుబాయిలకు కూడా వివరణ అవసరం లేదు. ప్రతి పద్యం సులభైక వైద్యం. అర్థం కానిదేది ఉండదు. నరసింహారెడ్డి రుబాయిలో మొదటి పాదంలో ఒక భావానికి ప్రతిపాదన చేస్తారు.
