పురస్కారాలు
డా. నరసింహారెడ్డి అందుకున్న పురస్కారాలు:
- కొత్తపలక (వచన కవిత)కు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం (2014)
- బండ్ల సుబ్రహ్మణ్యం స్మారక బహుమతి (1995)
- రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2016)
- నెలవంక నెమలీక వారి కలహంస పురస్కారం (2018)
- వర్కింగ్ జర్నలిస్టు కవిత్వ బహుమతి
- నవతెలంగాణ పట్టికోట ఆళ్వారుస్వామి ఉత్తమ కవితా పురస్కారం (2016)
- తెలుగాణ రాష్ట్రస్థాయి ఈ సాహితీ పురస్కారం (2017)
- కళాంజలి విజ్ఞానపీఠం వారి గౌరవ పురస్కారం
- జగిత్యాల బోయినపల్లి వెంకటరామారావు సాహిత్య పురస్కారం (2016)
- అక్షరకళాభారతి వారి అక్షర సాహితీ పురస్కారం (2018)
- రాజారాం ఫౌండేషన్ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం (2018)
- తెలంగాణ కళావేదిక వారి సామల సదాశివ రాష్ట్రస్థాయి పురస్కారం (2019)
- పాలమూరు సాహితీ పురస్కారం (2018)
- క్యాతం కృష్ణారెడ్డి స్మారక కవిత్వ పురస్కారం (2020)
- తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ మహబూబ్ నగర్ వారి కాళోజీ పురస్కారం (2020)
- తెలంగాణ రుబాయీలు’ కు గిడుగు రామ్మూర్తి పురస్కారం (2020)
- తెలంగాణ దుబాబులు’కు రావి రంగారావు ట్రస్ట్ వారి పురస్కారం
- మూల మలుపు కవితా సంపుటికి సృజన సాహిత్య సంగమం, అనంతపురం వారి శ్రీ బాపురం గురురాజారావు స్మారక పురస్కారం (2019)
- తెలంగాణ రుబాయీలు కు తెలంగాణా సార్వసత్వ పరిషత్తు వారి పురస్కారం (2022)
- సృజన భారతి వారి డా.సి . నారాయణ రెడ్డి స్మారక సాహిత్య పురస్కారం (2023)
- ఉదారి నాగదాసు స్మారక సాహిత్య పురస్కారం (2023)
- ‘పూల వూల వాన ‘ కు నాగ భైరవ సాహిత్య పురస్కారం (2024)
- తాటికొండల బ్రహ్మరాంబ సాహిత్య పురస్కారం (2023)
- తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – 2023 (తెలంగాణ రుబాయిలు కవితా సంపుటికి)
- పిఠాపురం వారి బాదం మాధవరావు పురస్కారం (ఎడుకోలలబాయి )
































దోరవేటి
బాష సరళం; భావం ఉదృతం; ధార అనువద్యం; సందేశం అలోచనాత్మకం. నా ఎరుకలో ఇటువంటి శతకం లేదు. నరసింహారెడ్డి గారికి ఉత్తమ సాహిత్యానికి, శతక పద్యానికి ఈ పుస్తకం చిరునామా గా నిలబడగలదనడం లో ఏ విధమైన సందేహం లేదు.
నెల్లుట్ల రమాదేవి
మాయ మాటల హామీల మర్మ మెరిగి గుర్తు లేకుండా ఓట్లేట్ల గుద్దుతావు ? ఓరి ఎంకన్న ! దోస్తుగా ! ఒర్లుబోతు ! ఒక్క మాటన్న వినవార ! తిక్కలోడ ! అన్న ముక్తాయింపును అచ్చమైన తెలంగాణా మాండలికంలో పలికించడమే ఈ శతకం ప్రత్యేకత.
డా. చీదెళ్ళ సీతాలక్ష్మి
అచ్చమైన తెలంగాణ యాసలో, వ్యావహారిక బాషలో నిత్య వ్యవహారంలోని పదాలతో స్వార్ధపూరిత రాజకీయ నాయకుల మాయ మాటలను నమ్మి వారి బూటకపు వలలో చిక్కిన ప్రజలను మీలుకోలపడానికి చేసిన కవితా ప్రయాణం చాలా బాగుంది.
చందా రాములు
మీ పంచతంత్రాలు ఒకప్పుడు దేవి ప్రియ రాసిన గరీబు గీతాలను గుర్తుకు తెస్తున్నాయి. మీ కవితలు సమాజ పోకడకు దర్పణాలు
అవధాని అవుసుల భానుప్రకాశ్
జర్ర వినువంచు రచియించి జగతికొసగే !
దివ్య నరసింహ రెడ్డియౌ భవ్యుడతడు !
పద్య రచనలో కొంగ్రొత్త పధము నడిచె,
సిత్తరమ్మగు పద్యాలు చెలువమెలికే !!
డా. కాచాపురం దుర్గాదేవి
వచన కవిత్వం లో కంటే పద్యం విసుర్ల ద్వారా పాఠకులకు ఉత్తేజితుల్ని చేయగలనని విశ్వసించడం అయన నమ్మకం.
మోతుకూరు నరహరి
ప్రాచీన కవులలో సీస పద్యానికి శ్రీనాధ మహాకవి పెట్టింది పేరు. ఆధునికులలో ఈ ప్రకియలో రాస్తున్న అరుదైన కవులలో నరసన్న అతి ముఖ్యుడు.
డా. మండల స్వామి
పాడుకోవడానికి వీలైన సీస పద్య ప్రక్రియ లో కొత్త వస్తువును ఎంచుకొన్నారు. సృజనకు శాస్వ తత్వాన్ని ఆపాదించారు. నాలుగు పాదాల మకుటం ప్రత్యెక ఆకర్షణ
ప్రేమ్ సాగర్ రావు
నేటి కుళ్ళు రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఏనుగు నరసింహారావు గారి తపన ప్రతీ కవితలో ఒక ఆవేదన రూపం లో కనిపిస్తుంది
డా. సి హెచ్ . సుశీల
ఈ జగత్తు, జీవితం, మనిషి అంతరంగం – ఇవన్నీ ప్రశ్నలతో నిండినవి. ఆ ప్రశ్నలకు సమాధానాలను కవిత్వ భాషలో, ముఖ్యంగా రుబాయి వంటి సంక్షిప్త ఛందస్సులో చెప్పడం సాహిత్యపరంగా గొప్ప సవాలు. ఆ సవాలును సమర్థంగా ఎదుర్కొన్న రచనగా డా. ఏనుగు నరసింహారెడ్డి గారి “తెలంగాణ రుబాయిలు” నిలుస్తుంది.
