Kotta Palaka

Kotha Palaka (A Collection of Poetry) in Telugu తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం పొందిన గ్రంథమిది. ఏనుగు నరసింహారెడ్డి కవితా ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోయే సంపుటి కొత్తపలక. తన అంతరాంతరాల్లోని అలజడిని, తన నేలమీద ఉన్న అపారమైన మమకారాన్ని పదునుగా సారవంతంగా వ్యక్తం చేసిన కవితల సమాహారమిది. బహిర్ముఖుడుగా కనిపించే కవిలోపలి ప్రపంచంలోని తండ్లాటను ప్రతిఫలించిందీ కొత్త పలక. కవిత్వ నిర్మాణపరంగా నరసింహారెడ్డిలో కొన్ని ప్రత్యేకతలున్నవి. కొన్నిసార్లు కవిత్వం సూటిగా చెప్పడం కంటే వ్యంగ్యంగా చెప్పడం అవసరం. దీన్ని దెప్పిపొడవడం అంటారు. ఈ పద్ధతిని నరసింహారెడ్డి సమర్థంగా వాదుకున్నాడు కొత్తపలకలో.

Scroll to Top