Critism on Modern Poetry ఇది ఆధునిక కవిత్వ విమర్శ. ఏనుగు నరసింహారెడ్డి ఆధునిక కవిత్వంపై చేసిన విశ్లేషణ ఈ అంతరంగం. ఇందులో ప్రసిద్ధ ఆధునిక కవులైన దాశరథి, సినారె, కాళోజీ, శివారెడ్డి, సదాశివ, గంగుల శాయిరెడ్డి, అమ్మంగి, సిధారెడ్డి, సుంకిరెడ్డి తదితర కవుల కల్పనా ప్రేరణలను, కల్పనా రహస్యాలను, లోతులను ఇందులో చర్చించారు. ఆధునిక కవిత్వం గురించి చెబుతూ కవి ఇలా అంటారు. ‘కవిత్వ నిర్వహణ, అత్యాధునిక కవిత్వ నిర్వహణ కత్తిమీద సామే. ఎందుకంటే దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆప్షనల్. కథ లేదు, పునాది కూడా లేదు. ఆధునిక వచన కవిత్వమంటే కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హార్మ్యం.’ ఈ ఎరుకతో రాసిన లోతైన సాహిత్య వ్యాసలివి. సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు అత్యంత ఉపయుక్త గ్రంథమిది. విస్తారంగా రాస్తున్న కవులు ఒక పునాదిగా దీన్ని చదివి తమ స్థానాన్ని అంచనావేసుకోవచ్చు.



















































