Telanganarubayilu

తెలంగాణ రుబాయిలు నరసింహారెడ్డిని గొప్ప తాత్వికుడైన కవిగా నిలుపుతుంది. ఈ కావ్యం రుబాయి ప్రక్రియను శిఖర స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. సరళమైన పదాలు, భావానికి తగిన చిత్రిక, శక్తివంతమైన ఉపమానాలు, లోతైన తాత్వికత, మృదువైన వ్యక్తి కరణ ఈ కావ్యం లోని మేలిమి గుణాలు. వేమన పద్యాలకు వ్యాఖ్యానం అక్కరలేనట్లుగానే నరసింహారెడ్డి రుబాయిలకు కూడా వివరణ అవసరం లేదు. ప్రతి పద్యం సులభైక వైద్యం. అర్థం కానిదేది ఉండదు. నరసింహారెడ్డి రుబాయిలో మొదటి పాదంలో ఒక భావానికి ప్రతిపాదన చేస్తారు. రెండో పాదంలో జిజ్ఞాస కల్పిస్తారు. మూడో పాదం లో భావ పరిణామం సాధిస్తారు. నాలుగో పాదంలో రుబాయిని రక్తి కట్టిస్తారు. ఈ నాలుగు పాదాల్లోనే ప్రపంచ పోకడలను అద్భుతంగా అక్షరీకరించారు.

Buy
Scroll to Top