మట్టి పాట ఆడియో క్యాసెట్టు, పల్లె జీవన శతకంగా పుస్తకం వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటిన తర్వాత ఆ పుస్తకం మీద ఒక విమర్శ పుస్తకం రావడం నా వరకు చాలా గుర్తించదగిన విషయమే. కానీ అందుకు కారణం మట్టి పాటలోని పల్లె స్థితిగతులను చిత్రిక పట్టిన సరళమైన పద్యాలేనని “మట్టి పాటలో మనసు పరిమళం” అని ఒక పుస్తకమే రాసిన శ్రీమతి మోదేపల్లి శీనమ్మ గారన్నారు. ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న ఆత్మీయ మిత్రుడు వాకిటి రామ్ రెడ్డి గారు మట్టిపాటలోని కొన్ని పద్యాలను పాడి దాని స్వారస్యాన్ని వినూత్నంగా ఆవిష్కరించారు. 8.6.2025 న కూకట్పల్లి లో జరిగిన కార్యక్రమం ఓ గొప్ప జ్ఞాపకం నాకు
